తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? – సర్కారుకు గద్దర్ సవాల్
సీఎం, డీజీపీ తరంకాదు – తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా?
- సర్కారుకు గద్దర్ సవాల్
- టీపీఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం
- హాజరైన నాగం, ఎర్రబెల్లి, విమలక్క, చుక్కారామయ్య, ప్రజా సంఘాల నేతలు
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం ముఖ్యమంత్రి, డీజీపీల తరం కాదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) కన్వీనర్ గద్దర్ అన్నారు. తెలంగాణవాదుల జోలికి వస్తే పునాదులు కదిలిస్తాం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ టీపీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పేరు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామన్న వరంగల్ డీఎస్పీ వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డి స్పందించి ఎవరిని ఎన్‌కౌంటర్ చేస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. వరంగల్‌లో పోలీసులు విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడితే.. ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు.
అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయకపోతే.. సీమాంధ్ర పాలకులు రక్తం ఏరులైనా పారించి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తారని హెచ్చరించారు. సకల జనుల సమ్మెను సార్వవూతిక ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌డ్డి మాట్లాడుతూ.. నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్ సీటుపై కూర్చునే కనీస అర్హత లేదన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంపై ఆయన ఇచ్చిన నివేదిక సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉందన్నారు. చంద్రబాబు సమైక్యవాది కాదనే విషయాన్ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఆత్మసాక్షిగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. అటు ప్రభుత్వానికి, ఇటు సమ్మెకు మద్దతునివ్వడం ఎలా సాధ్యమవుతుందో కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సకల జనుల సమ్మెతో తెలంగాణకే నష్టమని వ్యాఖ్యానించిన మంత్రి దానం నాగేందర్‌కు..మంత్రులందరూ రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటే రాజీనామాలకు సిద్ధమన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్న వారి అంతు చూస్తామని సీమాంధ్ర నాయకులు మాట్లాడటం వారి దురహంకారానికి నిదర్శమన్నారు. అసెంబ్లీ, సచివాలయానికి తాళాలు పడేవరకు సమ్మె కొనసాగించాలన్నారు.
ప్రజాసంఘాల జేఏసీ నాయకులు గజ్జెల కాంతం మాట్లాడుతూ.. ఉద్యమంలో కలిసిరాని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ఇళ్లను ముట్టడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అడ్డుగా ఉంటే సీమాంధ్ర నాయకులను దిగ్భందం చేస్తామని, వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఐక్య పోరాటం చేయాలని కోరారు. సమ్మె విఫలమైతే సీమాంవూధుల ముందు అబాసుపాలవుతామని, ఇప్పటికే వారి వెటకారం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ కార్యక్షికమంలో వేదకుమార్, రత్నమాల, మురళీ దేశ్‌పాండే, బెల్లయ్య నాయక్, చంద్రన్న, ఆకుల భూమయ్య, గోపాల్‌డ్డి, ఇన్నయ్య, రమేశ్ హజారే, సాంబశివరావు, సంధ్యరాణి, భాస్కర్, బాల లక్ష్మి, సంధ్యారాణి, పాశం యాదగిరి, రోజా తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యే దయాకర్‌డ్డి పాల్గొన్నారు.
ఎర్రబెల్లిని అడ్డుకున్న తెలంగాణ వాదులు
రౌండ్ సమావేశంలో ప్రసంగిస్తున్న సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణపై టీడీపీ వైఖరి ప్రకటించిన తర్వాతే మాట్లాడాలని టీపీఎఫ్ నేత కృష్ణ అడ్డుకున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలో దూకాలని సూచించారు. లేదంటే తెలంగాణలో టీడీపీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. గద్దర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. సమావేశం బయట కూడా ఎర్రబెల్లి, కొత్తకోట దయాకర్‌రావులపై తెలంగాణ వాదులు ప్రశ్నల వర్షం కురిపించారు.
Source from Namaste Telangana
Related posts:
- తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే! – ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్! తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా? చంపుతామంటే ఊరుకునేది లేదు – ఎంత మందిని చంపుతారో చూస్తాం
- తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
- ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.