సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – అందరిని కలుపుకొని ఉద్యమిస్తాం
- సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి
- ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం
- రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
- ‘టీ న్యూస్’ ఇంటర్వ్యూలో న్యూడెమొక్రసీ నేత పోటు సూర్యం
‘‘స్వయంపాలన కోసం కొమురం భీం, సమ్మక్క, సారక్కల పోరాటం.. తెలంగాణ విముక్తి కోసం, వెట్టిచాకిరి రద్దు కోసం భూస్వామ్య పాలనను ఎదిరించి నిలిచిన దొడ్డికొమురయ్య, చాకలి ఐలమ్మ, బందగిలతో పాటు తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఐదువేల మంది తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటాం. సకల జనుల సమ్మె గ్రామం నుంచి మొదలై హైదరాబాద్‌ను చుట్టేస్తుంది. అసెంబ్లీ, సెకట్రేరియట్‌తోపాటు ముఖ్యమంత్రి ఇంటికి తాళాలు వేస్తాం. విమానాశ్రయాన్ని స్తంభింపజేస్తాం. ఆంధ్రా పెట్టుబడిదారుల ఆర్థిక వనరులను దిగ్బంధిస్తాం. తెలంగాణ ప్రజలు తమ సత్తా చాటుతారు. సీమాంధ్ర పార్టీల విష కౌగిలి నుంచి తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ప్రతినిధులు పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి బయటకు రావాలి. తెలంగాణ నుంచి సర్కారుకు ఆదాయం రాకుండా ఊపిరి సలపకుండా చేస్తాం… మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమ కార్యాచరణ ఉంటుంది.’’
ప్ర:- సకల జనుల సమ్మె ఎలా జరగబోతున్నది?
జ:- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల కాలంగా జరుగుతున్న పోరాటాలకు పతాకస్థాయిగా సకల జనుల సమ్మెజరుగనుంది. ఈ సమ్మె ప్రభుత్వాన్ని, పరిపాలనను స్తంభింపజేయడమే కాకుండా ఉత్పత్తిని ఆపివేయడం లక్ష్యంగా ఉం టుంది. ముఖ్యంగా తెలంగాణ ద్రోహులైన ఆంధ్రా పెట్టుబడిదారుల ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది.
ఉత్పత్తి నిలిపివేత ఎక్కడెక్కడ ఉంటుంది?
ప్రధానంగా నల్లబంగారంగా చెప్పుకొనే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. సమ్మె నోటీస్‌లు కూడా జారీ చేశారు. అలాగే పబ్లిక్‌సెక్టార్‌లో ఉన్న బిహెచ్‌ఇఎల్‌తోపాటు ఇతర సంస్థలలో ఉత్పత్తి నిలిచిపోతుందిపజలు మద్యం దుకాణాలు బంద్ చేస్తారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధులు నిలిపివేస్తామని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో ఒక దశలో ప్రజలకు కొంత ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు ఉంటాయి. సమ్మె మొదలై క్రమంగా అన్నీ స్తంభింపజేసేందుకు ప్రజలే పూనుకుంటారు. ఇది ప్రజల కోరిక, ఆకాంక్షలమేరకు జరుగుతున్న సకల జనుల సమ్మె.
సకల జనుల సమ్మెలో ఏ ఏ వర్గాలు పాల్గొంటున్నాయి?
సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. ఆదివాసులు, దళితులు,మైనార్టీలు, ఉద్యోగులు, వ్యాపారులు, ్రైపైవేట్ ఉద్యోగస్థులు, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటారు. ప్రతి తెలంగాణ వాది పాల్గొంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
సమ్మెకు మీవ్యూహం ఏమిటి?
ఈ సమ్మె మొత్తం ఒక యాక్షన్ ప్రోగ్రాంలా ఉంటుంది. ఈ సమ్మెలో తెలంగాణ ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసేటట్లుగా, ఆ విధమైన వత్తిడి వారిపై చేసే విధంగా ఈ సకల జనుల సమ్మెలో కీలకమైన డిమాండ్ ఉండబోతున్నది. అన్ని ప్రదేశాలలో గ్రామాల నుంచి రాజధాని వరకు ప్రజా ప్రతినిధులపై వత్తిడి ఉంటుంది. సమ్మె విజయవతం చేయడానికి ఖమ్మంలో న్యూడెమొక్షికసీ, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్, నల్లగొండలో బీజేపీ పార్టీలు భారీ బహిరంగ సభలను నిర్వహిస్తాయి.
విస్తృతంగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ఖమ్మం సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. 13 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు.10 జిల్లాల్లో 4 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగుల సంఘీభావాన్ని కోరింది. వాళ్లు సమ్మెలో పాల్గొంటామని ప్రకటించారు. చేయకపోతే ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమ్మె లక్ష్యం మొత్తం పాలనను స్తభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే. చివరగా అన్ని దార్లనుంచి లక్షలాది మందితో హైదరాబాద్‌ను దిగ్బంధించడం జరుగుతుంది.
గతంలో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారికి బయటి నుంచి మద్దతురాలేదు కదా? ఈ సారి జరగబోయే సమ్మెకు మద్దతుగా ఏమి చేయబోతున్నారు?
ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు మా మద్దతు ఉంది. క్రియాశీలకంగా మద్దతు రాలేదు. ఉద్యోగ సంఘాలు ఒకేసారి నిరవధికంగా 16 రోజులు సమ్మె చేయడం చారివూతకం. ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడా ఇటువంటి సమ్మె జరగలేదు.ఇది తెలంగాణ ప్రజలకు స్పూర్తిగా నిలిచింది. ఈసమ్మెలో మూడు రాజకీయ పార్టీలు సమ్మెలో పాల్గొంటున్నాయి.
గ్రామం నుంచి నగరం వరకు అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. రాజకీయపార్టీలుగా వారికి కావాల్సిన మనోసై్థర్యాన్ని ఇస్తాం. కావాల్సిన యుద్ధ సామాక్షిగిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఒక వేళ ప్రభుత్వం వీరిని ఇబ్బందులకు గురిచేస్తే ఆదుకుంటాం. వారికి జీతాలు ఇవ్వకుంటే ఆకలి తీర్చే కార్యక్షికమాన్ని చేపడతాం. గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అత్యవసరాలకు ప్రజల నుంచి వసూలు చేసి ఇస్తాం. ప్రభుత్వాన్ని నిలదీసి సమ్మెకాలానికి చెందిన వేతనాన్ని ఇప్పించడం జరుగుతుంది. గ్రామాల్లో ప్రజలు, వృత్తుల వాళ్లు ప్రజా ప్రతినిధుల పనులను బహిష్కరిస్తారు.
గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగం ఈ సమ్మెలో ఎలా పాల్గొనబోతున్నది? మీరు వారికి ఇచ్చే కార్యక్షికమమేమిటి?
తెలంగాణ గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగం సకల జనుల సమ్మెలో ముందు వరుసలో ఉంటుంది. రైతాంగం సమ్మెలో పాల్గొనడమం సర్కారుపై తిరుగుబాటు ప్రకటించినట్లుగా భావించాలి. తెలంగాణ కోసం రైతాంగం ప్రభుత్వానికి చెల్లించే ఏరకమైన పన్నులను చెల్లించదు. బ్యాంకురుణాల నుంచి మొదలు కొని కరెంటు బిల్లులతో సహా అన్ని రకాల పన్నులు చెల్లించకుండా నిరాకరిస్తుంది. చావిడీల దగ్గర మీటింగులు నిర్వహించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు ఉదయం ప్రభాతభేరి ప్రదర్శనలు చేయడం జరుగుతుంది.
హైదరాబాద్‌లో సమ్మె ఉధృతంగా జరిగేందుకు మీరేం చేయబోతున్నారు?
హైదరాబాద్ జన్మహక్కుగా ప్రతి తెలంగాణ పౌరుడు దృఢంగా కలిగిఉన్న అంశం. నగరంలోని ప్రతి వ్యక్తి దీనిని కాపాడుకోవడానికి దృఢంగా ఉన్నాడు. పాతనగరంతోపాటు, ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లు నేరుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో పరిపాలనను స్తంభింప జేస్తారు. సెక్ర అసెంబ్లీకి, ముఖ్యమంత్రి ఇంటికి తాళం వేసే దిశగా ఈ ఉద్యమం ఉంటుంది. అత్యవసర సర్వీసులైన పాలు, కూరగాయలు, విద్యుత్, నీళ్లు, శాని మినహా జీహెచ్‌ఏంసీతో సహా అన్ని విభాగాలకు ప్రజలు తాళాలు వేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్త తీయరు, రోడ్లు ఊడ్చేదిలేదు. నగరంలోని పారిక్షిశామిక ప్రాంతాలకు చెందిన వివిధ పరిక్షిశమల కార్మికులు, ఉద్యోగులు, ఐటి పరిక్షిశమలను కూడ నడవనీయరు. ఎయిర్‌పోర్టును కూడా మూసేస్తాం.
ఎలాంటి మిలిటెంట్ పోరాటానికి పిలుపు ఇచ్చినా అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఈ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యానికి, సమ్మెకు ముడిపెట్టడం ఉద్యమ చైతన్యంపై నీళ్లుచల్లడం కాదా?
సోనియాగాంధీ ఆరోగ్యానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఎవరికి అనారోగ్యం వచ్చినా, మరేం జరిగినా తెలంగాణ సాధించుకునే లక్ష్యంగానే ఉద్యమం ఉంటుం ది. సోనియా ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకున్నారని సమైక్యవాదు లు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు. వాటిని పట్టించుకోం.
ముందు గుజ్జర్ల తరహా అన్నారు… తరువాత జార్ఖండ్ అన్నారు. ఇప్పుడు మణిపూర్ అంటున్నారు.. మీ పోరాటానికి ఎవరు స్ఫూర్తి? ఎప్పటి నుంచో మాట్లాడుతున్న ఆర్థిక దిగ్బంధం జరిగేది ఎప్పుడు?
తెలంగాణ ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉంది. కొమురంభీం. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ, బందగి లాంటి అమరవీరులు తమ స్వయం పాలన కోసం, వెట్టిచాకిరీ నుంచి ప్రజల విముక్తి కోసం గొప్ప ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఈ అమర వీరులు నిర్వహించిన ఉద్యమాలే స్ఫూర్తి. దేశవ్యాప్తంగా, ప్రపంచంలో జరిగే అన్ని ఉద్యమాల అనుభవాలను క్రోడికరిస్తాం. తెలంగాణ ఉద్యమం తెలంగాణదే… తెలంగాణవిముక్తి కోసం సాయుధ పోరాటం కంటే ముందు ఆంధ్రమహాసభ నాయకత్వాన జరిగిన గుతుపల సంఘం ఉద్యమాన్ని స్వీకరిస్తాం. సాయుధ పోరాటం జరిగింది.
5 వేల మంది అమరవీరులయ్యారు. ఈ ఉద్యమాలన్నీ తెలంగాణ గడ్డమీద జరిగినవే… ఇవే మాకు గొప్ప స్పూర్తి. 1953లో గుంటూరులో ఒక ప్యూన్ ఉద్యోగం తమిళుడికి ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిర్వహించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ఉద్యమం కూడా మాకు స్ఫూర్తినిస్తుంది. అదే స్పూర్తితో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నా ము. అక్కడ ఒక్క ఉద్యోగం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని అడిగారు. ఇక్కడ లక్షల ఉద్యోగాలు పోయాయి. కోట్లాది సంపద కొల్లగొట్టబడింది. ఆత్మగౌరవంతో తెలంగాణ కావాలని పోరాడుతున్నాము. ఉత్తరాంచల్ రాష్ట్ర ఏర్పాటు అయ్యే వరకు ఎన్నికలు జరగనివ్వకుండా వారు నిర్వహించిన ఉద్యమం కూడా మాకు ఆదర్శమన్నారు. తెలంగాణ కోసం ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఉద్యమిస్తుంటే, తెలంగాణ ఇస్తానన్న పాలకులే ఇవ్వకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
సమ్మెకు మద్దతు విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని భావిస్తున్నారా?
కాంక్షిగెస్, టీడీపీ పార్టీలు ఇప్పటి వరకు మద్దతు తెలుపలేదు. వీరి మద్దతు కోసం ప్రజలు కూడా ఎదరుచూడటం లేదు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలను పార్టీ పరంగానే చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి ఇప్పటి వరకు అడ్డంకిగానే ఉన్నాయి. అవి పాల్గొంటాయని అనుకోవడం లేదు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీలను ఒకటి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ గతంలో ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. రాష్ర్టపతి ప్రసంగంలో పొందుపర్చారు. కానీ కాలయాపన చేస్తున్నారు. దీనిపై గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన చేయాలి. అధిష్ఠానం చేత ప్రకటింప జేయాలి. అలాగే తెలుగు దేశంపార్టీ కూడా 2008లో తెలంగాణపై చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయాలి.
పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించడంతోటే ఆనాడు డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల అనుమానాలను బాబు ప్రకటన చేసి నివృత్తి చేయాలి. అది జరగకపోతే ఆ నాయకులు తెలంగాణ కోసం పార్టీకి,పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలి. అప్పుడు వారిని నమ్మి జేఏసీలో కలుపుకుంటాం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాగం గ్రూపును జేఏసీ స్వాగతించింది. వారు చేపట్టే దీక్షలకు, సభలకు జేఏసీ తరపున హాజరవుతున్నాం. సమ్మెలో నాగం గ్రూపు పాల్గొంటుదనే నమ్మకం ఉంది. వారు తెలంగాణ కోసమే రాజీనామాలు చేశారని విశ్వసిస్తున్నాము.
100 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా రాని తెలంగాణ సకల జనుల సమ్మెతో వస్తుందా?
సకల జనుల సమ్మె అన్నింటికంటే గొప్పది. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తుంది. ప్రజా ప్రతినిధుల రాజీనామాల కంటే ఉన్నతమైనది. దీని ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చు.ఇది ప్రజా ప్రతినిధులను కట్టడి చేస్తోంది. మరో మిలియన్ మార్చ్‌ను తలపించే పద్ధతుల్లో ఈ ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమంలో ప్రకటిత, అప్రకటిత కార్యక్షికమాలు ఉంటాయి.
రాజీనామాలతో సంక్షోభం సృష్టించాలన్న వ్యూహం విఫలం కావడానికి బాధ్యుపూవరో చెపుతారా?
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకోన్ముఖంగా తెలంగాణపై దాడి ప్రకటిస్తున్నాయి.రాజీనామాలతో తెలంగాణ సాధన సరైన వ్యూహమే. ఇది ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నది. మరింత ముందుకు వెళ్లి రాజకీయ సంక్షోభాన్ని, రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేదే. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గజ్జున వణికాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ పార్టీలు చెప్పడానికి వీలులేని అవకాశవాద విధానాలను అవలంభించాయి. సమైక్య ప్రభుత్వం వాళ్ల స్వభావంతో స్పీకర్‌కు వచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని తిరస్కరించారు. ఇది సమైక్య సర్కారు కుట్ర.. దీంట్లో సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గ ప్రతినిధులైన కావూరి, లగడపాటి, రాయపాటిలతో పాటు చంద్రబాబునాయుడు కూడా బాధ్యుడే.
మరోసారి రాజీనామాలు చేసే విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎందుకు వెనుకాడుతున్నారు?
సమైక్యవాదులు తెలంగాణను అడ్డుకోవడంలో భాగంగా ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. కానీ తెలంగాణపై చిత్తశుద్ధి వీరు వెంటనే రాజీనామాలు చేయాలి. కానీ అలా చేయకుండా ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని రాజీనామాలు చేయకుండా దాట వేస్తున్నారు. అయితే చైతన్యవంతమైన ప్రజలు రాజీనామాలు చేయకుండా నాన్చుడు ధోరణ అవలంభిస్తున్న నేతలను అడ్డుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కోదండరాం ప్రజా ప్రతినిధులకు నిరసన తెలుపమని, రాజీనామాలు చేసే వరకు వత్తిడి చేయమని పిలుపు ఇస్తే టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు చేశాడు. మోత్కుపల్లి నర్సింహులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని అన్నాడు. ఇలా అనడం ద్వారా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. వీరు సమైక్య వాద పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు ఆడుతున్న నాటకంలో పావులుగా మారారు. పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. వీరికి ప్రజల కంటే పార్టీలు, పదవులే ముఖ్యమైనట్లు కనిపిస్తున్నది.
ఉద్యమాన్ని ముందుకు తీసుకు వివిధ పార్టీల మధ్య ఐక్యత కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలేమిటి?
జేఏసీ తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీలను, దీని కోసం పని చేసేవారిని కలుపుకొని ఉద్యమం చేయడానికి కృషి చేస్తున్నది. ఈ మేరకు నాగం గ్రూపును, సీపీఐ పార్టీలతో పాటు, గద్దర్, విమల, ఇతర ప్రజా సంఘాల జేఏసీలను కలువనున్నాం. కాంగ్రెస్,టీడీపీలకు సంబంధించినంత వరకు వాళ్లు రాజీనామాలు చేసే వరకు పిలిచే ప్రసక్తి లేదు. 141 మంది రాజీనామాలు చేసినప్పడు జేఏసీ ప్రశంసించింది. అయితే స్పీకర్ రాజీనామాలు తిరస్కరించారు. దీంతో తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్నా, సకల జనుల సమ్మెకు సమాయత్తమవుతున్నా.. మళ్లీ రాజీనామాలు చేయడంలో వెనుకాడుతున్నారు.
కాంగ్రెస్ స్టీరింగ్‌కమిటీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్నట్లుంది కదా? అసలేం జరుగుతోంది?
తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం, డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల తీరు దుర్మార్గం. రాజనర్సింహ డిప్యూటీ సీఎం, జానాడ్డి కేబినెట్ పదవి సంపాదించుకున్నారు. వారి తగాదా అంతా ‘‘సచ్చిపోయిన గొర్రెకు వాత పెట్టిన తరువాత మంచిగ కుదిందా.. కుదరలేదా’’ అని చర్చించినట్లుగానే ఉంటుంది. వారు, పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి బయటకు వస్తేనే లెక్క. అందులోనే ఉండి మాట్లాడటంలో అర్థం లేదు.
గతకొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే ఉద్యమం చప్పబడిపోతోందని కొందరు తెలంగాణ వాదులు భయపడుతున్నారు. వారికి మీరు ఏవిధంగా దైర్యాన్ని ఇస్తారు?
తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చప్పబడలేదు.రాజకీయ పరిణామాలలో జరిగే మార్పులతో తీవ్రతలో తేడాలుంటాయి. ఆ తేడాలను సరిగ్గా గమనించకుండా ఉద్యమాలు స్తబ్దతకు గురయ్యాయని తెలిసి చెప్పినా, తెలియక చెప్పినా అది తప్పుడు ప్రచారమే. ఉద్యమం సజీవంగా ఉంది. సకల జనుల సమ్మెతో హైదరాబాద్‌ను ఒక చుట్ట చుడుతుంది.
2014 వరకు వరకు తెలంగాణ వాయిదానే అంటున్నారు.. మీరేమంటారు?
2014 అనేది తప్పు.. 2011లోనే తెలంగాణ తీసుకురావడానికి సకల జనుల సమ్మె జరుగుతుంది. ఉద్యమాన్ని అణచడానికి 8 వచాప్టర్‌లో చిట్కాలు చెప్పింది. మేనేజ్ చేయడం ద్వారా, నిర్బంధాన్ని ప్రయోగించడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరు. శ్రీకృష్ణకమిటీ రిపోర్టు చూస్తే దుగ్గల్ తయారు చేసిన రిపోర్టులా ఉంది. ఇది ‘‘పుండు మీద కారం చల్లినట్లు’గా ఉంది. ఇలాంటి రిపోర్టులు ఏమి చేయలేవు. వాయిదాలు అసలేలేవు. సీమాంవూధుల దృష్పచారాన్ని నమ్మవద్దు. మిలియన్ మార్చ్ తరహాలో సకల జనుల సమ్మె చేసి ఈఏడాదే తెలంగాణ సాధించుకుందాం.
source from Namaste Telangana
Related posts:
- ఓడి బానిసలవుదామా? నిలిచి గెలుద్దామా? ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ
- ఉద్యమం ఎప్పుడైనా భగ్గుమంటది: కోదండరాం
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.