
సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
శాంతియుతంగా జరుగుతున్న సింగరేణి కార్మికుల సమ్మెను అప్రజాస్వామికంగా అణచివేయజూస్తున్నారని, సింగరేణి నుంచి తక్షణమే పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెలంగా ణ జర్నలిస్టుల ఫో రం ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కిరణ్‌ను కలిసిన తెలంగాణ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధి బృందం కోరింది. ప్రభుత్వ వైఖరి సరికాదని స్పష్టం చేసింది. అందుకు సీఎం ప్రతిస్పందిస్తూ.. ప్రజలకు నష్టం కలిగించే విధంగా సమ్మె ఉన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతినిధి బృందంతో అన్నారు. సత్వరమే తెలంగాణకు పరిష్కారం చూపాలని, ఈ సమస్యను [...]