తెలంగాణవాదులపై రెచ్చిపోయిన మంత్రి – దళితునిపై దానం దాదాగిరి. – నిరసన తెలిపినందుకు లాఠీతో వీరంగం…దానంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

| October 17, 2011 | 2 Comments

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఆదివారం రౌడీ అవతారమెత్తారు. తన అనుచరులతో కలిసి తెలంగాణవాదులపై దాడికి తెగబడ్డారు. పోలీసుల చేతుల్లో నుంచి లాఠీని లాక్కొని వీరంగం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా స్కూటర్‌పై అక్కసును వెళ్లగక్కారు. కసి తీరా ఆ వాహనాన్ని తన్ని బూతు పురాణం వల్లించారు. దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నాయకుడు శ్రవణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నా వదలలేదు. ‘ఒరేయ్ నీ అ..’ అంటూ దుర్భాషలాడారు. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారు. మంత్రి గూండాయిజానికి భీతిల్లిన జనం పరుగులు తీశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాజీనామా చేయాలని నిరసన తెలిపినందుకే మంత్రి ఇలా దాదాగిరి చేసి ఈస్ట్‌మాడ్‌పల్లిలో రెచ్చిపోయారు. మంత్రి దానం నాగేందర్ ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ మారేడుపల్లిలో స్టార్ హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించేందుకు బయలుదేరారు.

8795-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema

ఆయన రాకను తెలుసుకున్న కొందరు తెలంగాణవాదులు స్థానిక దేనాబ్యాంకు వద్ద వేచి ఉన్నారు. మంత్రి కాన్వాయ్ రాగానే అడ్డుకున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు మంత్రి కాన్వాయ్‌పైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అంతే.. మంత్రి గారికి కోపం వచ్చింది. ఆయన అనుచరులకు మరింత కోపం వచ్చింది. వారు మూకుమ్మడిగా తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ నగర అధ్యక్షుడు వీర వల్లబ్ తదితరులు అక్కడే ఉన్న స్కూటర్‌ను బండరాళ్లతో ధ్వంసం చేశారు. వారికి తోడుగా మంత్రి దానం నాగేందర్ ఆ వాహనాన్ని కాలుతో తంతు కసితీర్చుకున్నారు. మంత్రి, ఆయన అనుచరులు సృష్టించిన బీభత్సానికి జనం పరుగులు తీశారు. టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహ యాదవ్, శ్రవణ్ అలియాస్ శేర్విన్‌లు కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. వారిపై కూడా మంత్రి అనుచరులు తెగబడ్డారు.

దీంతో నర్సింహ యాదవ్ తప్పించుకొని వెళ్లగా దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నేత శ్రవణ్ మాత్రం దొరికిపోయారు. శ్రవణ్‌పై మంత్రి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. అంతటితో ఆగని మంత్రి అక్కడే ఉన్న పోలీసుల చేతిలో నుంచి లాఠీని లాక్కొని తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. దాడిలో గాయపడ్డ శ్రవణ్ భయంతో పరుగులు తీసి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నారు. అయినా మంత్రి వదలలేదు. ‘ఒరేయ్.. నీ అ..’ అంటూ బూతులు అందుకున్నారు. మళ్లీ దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చేతులుడిగి చూశారు. దాడిని ఆపలేకపోయారు. ‘నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. లేకుంటే నిన్ను సస్పెండ్ చేయిస్తా’నంటూ తుకారాంగేట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కిరణ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన హెల్త్ కేర్ సెంటర్‌ను ప్రారంభించి తిరిగి బయటకు వచ్చారు.

మంత్రి తీరుపై తెలంగాణవాదులు మండిపడ్డారు. ఆయను అడ్డుకొని నిరసన తెలిపారు. ‘మంత్రి స్థానంలో ఉండి మాపై దా చేస్తావా’ అంటూ మహిళలు, యువకులు నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి తుకారంగేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రౌడిషీటర్‌తో మంత్రి హల్‌చల్!
అడ్డగుట్టకు చెందిన డి.మోహన్‌పై గత బోనాల పండుగ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. కాగా ఆదివారం రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్‌తో కలిసి తెలంగాణవాదులపై మోహన్ దాడికి దిగాడు. శ్రవణ్‌పై దాడికి పాల్పడిన మంత్రి దానంపై తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది.

SOURCE FROM NAMASTE TELANGANA

Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in

No related posts.

Tags:

Category: News, Telangana

Comments (2)

Trackback URL | Comments RSS Feed

  1. praveen says:

    telanga dhori danam

    minister ani marachi oka veedu roudy la chesina paniki minister nundi teseyali

  2. praveen says:

    danam okka langa, seemandrulu thothttu

Leave a Reply



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Free Blood Donors Hyderabad, warangal
Free Blood Donors Hyderabad, warangal