‘మడత కాజా’ ఫుల్‌మీల్స్-‘మడత కాజా’లో నరేష్ ఎలా వుంటాడు?-మడత కాజాలో వుండే కొత్తదనం ఏమిటి?
‘ రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రం ‘మడత కాజా’. ఈ చిత్రానికి ముందు కన్నింగ్ కళ్యాణ్ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ చివరికి కథకు అనుగుణంగా ‘మడత కాజా’ టైటిల్‌ని పెట్టాం. నా గత చిత్రాలకూ ఈ చిత్రానికి కామెడీ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది. నా నుంచి ప్రేక్షకులు ఏమైతే ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వున్నాయి. పక్కాగా చెప్పాలంటే ప్రేక్షకులకు ఇదో ఫుల్‌మీల్స్ లాంటి చిత్రం’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘‘మడత కాజా’. సీతారామరాజు దంతులూరి దర్శకుడు. స్నేహా ఉల్లాల్ నాయిక. ఈ చిత్రం ఈ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ చెప్పిన సంగతులు…
‘మడత కాజా’లో నరేష్ ఎలా వుంటాడు?
ఇందులో నా పాత్ర పేరు కళ్యాణ్. తెలివైనోడు, అలాగే తింగరోడు. అలాంటి వాడు ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయికి ఐలవ్‌యు మాత్రం చెప్పడు. మడతపెట్టి, మెలిక పెట్టి చివరికి ఆ ఆమ్మాయి చేతే ఐలవ్‌యు చెప్పించుకుంటాడు.
స్నేహా ఉల్లాల్‌తో తొలిసారి నటించారు కదా ఆమె గురించి చెప్పండి?
మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ స్నేహా ఉల్లాల్ చాలా చక్కగా నటించింది. అంతే కాకుండా ఆ మధ్య ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో ఆమె కాలికి గాయం అయినా ఎంతో శ్రద్ద తీసుకుని ఆ గాయాన్ని పట్టించుకోకుండా ఈ చిత్రంలో ది బెస్ట్ పెర్ఫ్మాన్స్‌ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఆమె ఈ చిత్రంలోని గీతాల్లో చేసిన డాన్స్‌ని చూసి అంతా అభినందిస్తారు.
మడత కాజాలో వుండే కొత్తదనం ఏమిటి?
నా గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కామెడీ చాలా కొత్తగా వుంటుంది. అలాగే ప్రతి సన్నివేశంలో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులని కడుపబ్బా నవ్విస్తాయి. పక్కాగా చెప్పాలంటే ఇదో ఫుల్‌మీల్స్ లాంటి చిత్రం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకముంది.
మీ నుంచి వస్తున్న తదుపరి చిత్రాలు ఏమిటి?
తమిళంలో ‘సువూబహ్మణ్యపురం’ టీమ్‌తో ‘పొరాలి’ అనే చిత్రం చేస్తున్నాను. పోరాలి అంటే యోధుడు అని అర్థం. ఈ చిత్రం నవంబర్‌లో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంతోపాటు శర్వానంద్‌భశియలతో కలిసి ఓ చిత్రం చేయబోతున్నాను. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు నారాయణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇది అక్టోబర్ 1న ప్రారంభం కాబోతుంది. అంతే కాకుండా భీమనేని శ్రీనివాసరావుతో కూడా ఓ చిత్రం చేయనున్నాను. ఇది విజయదశమి రోజున ప్రారంభం కానుంది. ఈ చిత్రాలతో పాటు ఇ. సత్తిబాబు, దేవీవూపసాద్, చందులతో వరుస చిత్రాలు చేయబోతున్నాను’ అన్నారు.
source from namasthe telangaan
No related posts.
Category: Cinema News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.