గాలి ఉత్థానపతనాలివి! – కానిస్టేబుల్ కొడుకు కోట్లకు పడగలెత్తాడు – పది లక్షల పెట్టుబడి.. ఐదేళ్లలో 3వేల కోట్లయిన మంత్రం! – వడ్డీకాసులవాడికి రూ.45కోట్ల విలువైన కిరీటం
కానిస్టేబుల్ కొడుకు కోట్లకు పడగలెత్తాడు – రెండు గదుల ఇరుకు జీవితం భారీ భవంతులకు చేరిన వైనం
- పది లక్షల పెట్టుబడి.. ఐదేళ్లలో 3వేల కోట్లయిన మంత్రం!
- ఇంట్లో పెళ్లి ఖర్చే రూ.20కోట్లు
- వడ్డీకాసులవాడికి రూ.45కోట్ల విలువైన కిరీటం
- గాలి ఉత్థానపతనాలివి!
ముగ్గురు గాలి సోదరుల్లో మధ్యముడు గాలి జనార్దనడ్డి. ఈ ముగ్గురికి తోడు శ్రీరాములు. ఆదివారం నాడు కర్ణాటక అసెంబ్లీకి రాజీనామా చేసిన శ్రీరాములు గాలి సోదరులకు అత్యంత సన్నిహితుడు. నాల్గో సోదరుడి లెక్క! ఈ బృందానికి నాయకుడు జనార్దనడ్డి. ఈ నలుగురూ అనతికాలంలోనే వేల కోట్లకు పడగపూత్తడానికి జనార్దనడ్డి వ్యూహాలే దోహదం చేశాయంటారు విశ్లేషకులు. తన ఇంట్లో జరిగిన వివాహ శుభకార్యానికి గాలి జనార్దనడ్డి రూ.20 కోట్లు ఖర్చుపెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వివాహానికి వచ్చిన అతిథుల తరలింపునకు హెలికాప్టర్లు వాడారంటే ఏ స్థాయిలో పెళ్లి ఖర్చు జరిగి ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.
పాప పరిహారం కోసం దేవుడి సేవల్లోనూ జనార్దన్‌డ్డి అందె వేసిన చెయ్యే! రూ.45 కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని వడ్డీకాసులవాడికి బహూకరించిన కుబేరుడు గాలి జనార్దన్‌డ్డి. అయితే.. ఈయనకు ఈ సంపదంతా పుట్టుకతోనే వచ్చిందా? ఆయన పుట్టే నాటికే వాళ్లింట్లో విదేశీ కార్లు బారులు తీరి ఉండేవా? భారీ భవంతులు ఆయన తన చిన్ననాటే చూశారా? తుపాకులతో కాపలా కాసే సిబ్బంది అప్పటి నుంచే ఉండేవారా? లేదు.. ఇవేవీ లేవు. ఆయన పుట్టుకతో కోటీశ్వరుడు కాదు కదా.. కనీసం లక్షాధికారి కూడా కాదు. కానీ.. గాలి జనార్దన్‌డ్డి చేసిన వ్యాపారం ఆ సంపదను సృష్టించింది. గాలి సోదరులు నడిపి మంత్రాంగం వారిని సిరిసంపదల శిఖరాలపై కూర్చొనబెట్టింది.
గాలి జనార్దన్‌డ్డి తండ్రి చెంగాడ్డి ఓ సాదాసీదా కానిస్టేబుల్. వారి జీవితం మొదలైంది రెండు గదుల పోలీస్ క్వార్ట్‌ర్స్‌లో. 1967లో పుట్టిన గాలి జనార్దన్‌డ్డి.. వీటికి అతీతంగా ఎదిగాడు. వేలు లక్షలతో వ్యాపారాలు ప్రారంభించి.. ఇప్పుడు వేల కోట్లకు ఆసామి అయ్యాడు. ఆయన ఇద్దరు సోదరులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. జనార్దనడ్డికి మాత్రం చదువు గాలి సోకలేదు. ఆయన చదువుకున్నది పాతకాలపు ఎస్‌ఎస్‌ఎల్‌సీ. అంటే ఇప్పటి పదో తరగతికి సమానం. కానీ.. జీవిత పాఠాలు మాత్రం బాగా నేర్చాడు. చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంటుగా ప్రస్థానం మొదలు పెట్టి.. బతుకుబడిలో డబ్బు సంపాదించే మార్గాలను నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే కోట్లకు పడగపూత్తాడు. 1990 దశకం జనార్దనడ్డికి కీలకమైంది. జనార్దనడ్డి చొరవతో ముగ్గురు సోదరులూ కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సమయంలో తమ వ్యాపార వ్యూహాలకు పదును పెట్టారు.
తమకు అత్యంత సన్నిహితుడైన శ్రీరాములు ద్వారా తొలుత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. శ్రీరాములు అప్పటికి స్థానిక కాంగ్రెస్ నాయకుడు. 1999 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గాలి సోదరులకు టికెట్‌లు రాకపోవడంతో వారు బీజేపీ పంచన చేరారు. వారికి బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన సుష్మాస్వరాజ్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. అప్పట్లో సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై బళ్లారి నుంచి పోటీ చేశారు. సుష్మా ఓడిపోయినా.. ఆమె దృష్టిలోపడటంలో రెడ్డి సోదరులు విజయం సాధించారు. బళ్లారిలో బీజేపీని అభివృద్ధి చేసేందుకు రెడ్డి సోదరులు పని చేశారు. అక్కడి నుంచి బీజేపీకి గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లను సంపాదించి పెట్టారు. కాంగ్రెస్‌కు కంచు కోట అన్న స్థాయిలో ఉన్న బళ్లారిని మార్చివేసి.. బీజేపీ కోటను కట్టారు. అప్పటి నుంచి వారికి రాజకీయ కండ పెరిగింది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. మొత్తం కర్ణాటక రాజకీయాలనే శాసించేంత.
కర్ణాటకలో ప్రభుత్వాలను తన చేతి వేళ్లపై ఆడించేంత. ప్రభుత్వం కూలిపోతుందన్న వాతావరణం కల్పించేంత! యడ్యూరప్ప ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన గాలి సోదరులు.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తెచ్చారు. వారం పాటు నోవాటెల్ హోటల్‌ను ఆధీనంలో ఉంచుకున్నారు.
దక్షిణ భారతదేశంలో బీజేపీ పాలిస్తున్న ఏకైక రాష్ట్రం కావడంతో ఆ పార్టీ అధిష్ఠానం కూడా గాలి సోదరులకు దాదాపు తలొగ్గింది. ఓవైపు కర్ణాటకలో బీజేపీ తరఫున రాజకీయం చేస్తూనే.. మరోవైపు సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రవూపదేశ్‌లో కాంగ్రెస్ నేతలతో చెలిమి చేశారు గాలి సోదరులు. ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర్‌డ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్‌డ్డిలతో దాదాపు బంధుత్వం ఉందన్న స్థాయిలో సంబంధాలు నడిపారు.
తనకు జగన్ సోదర సమానుడని జనార్దనడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. వైఎస్ సొంత జిల్లా కడపలో బ్రహ్మణీ స్టీల్స్ పేరుతో భారీ కంపెనీ ఏర్పాటు చేసే క్రమంలో జగన్ ఆయనకు భాగస్వామి కూడా. బ్రహ్మణీ స్టీల్స్ శంకుస్థాపన సందర్భంగా గాలి జనార్దనడ్డి.. వైఎస్‌కు ఒక బస్సును కూడా బహూకరించారు. దానిపైనే తర్వాతి కాలంలో వైఎస్ వివిధ పర్యటనలు చేశారు.
2001 గాలి సోదరులకు మరో కీలకమైన సంవత్సరం. అదే యేడాది వారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ మొదటి పెట్టుబడి పది లక్షలు. 2002లో ఆ కంపెనీకి గాలి జనార్దనడ్డి డైరెక్టరయ్యారు. 2003-2004 సంవత్సరానికే ఓఎంసీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక మైనింగ్ లీజులను తీసుకుంది. కంపెనీ టర్నోవర్ 35 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత ఐదేళ్లలో అంటే 2009 నాటికి టర్నోవర్ 3వేల కోట్ల రూపాయలు దాటింది. ఇందుకు అప్పటి ఏపీ సీఎం వైఎస్ సహకారం ఉందన్న వాదన ఉంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ బలం సంపాదించుకున్నారు గాలి సోదరులు. పైగా ఇనుప ఖనిజాన్ని తన గర్భాన నింపుకొన్న బళ్లారిని తమ సొంత రాజ్యంగా ఏలారు. వైఎస్ చనిపోయిన తర్వాత గాలి సోదరులకు ఎదురు గాలి వీయడం మొదలైంది.
రాష్ట్ర సరిహద్దులను మార్చేశారని, వారికి లీజుకు ఇచ్చిన ప్రాంతాన్ని ఉల్లంఘించి.. హద్దులు దాటి మైనింగ్ చేశారని సుప్రీం కోర్టు నియమించిన సాధికార కమిటీ తేల్చింది. పెద్దమొత్తంలో ఉల్లంఘనలు జరిగాయని ప్రకటించింది. 2004 నుంచి 2017 వరకు మైనింగ్ జరుపుకొనేందుకు వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన లీజు అక్రమమని తేల్చింది. వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన రోశయ్య.. ఓఎంసీకి ఇచ్చిన మైనింగ్ లీజును సస్పెండ్ చేస్తూ.. సీబీఐ విచారణను కోరింది. దర్యాప్తు చేసిన సీబీఐ.. సోమవారం అరెస్టులు చేసింది.
source from Namaste Telangana
No related posts.
Category: Latest News, News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.