సిద్ధమైన ‘అల్లం బెల్లం-2’
‘ఆది’ ఫేమ్ కీర్తిచావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘అల్లం బెల్లం-2’. సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జెయన్‌ఆర్ పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘వినోదంతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యూత్, మాస్‌కు నచ్చే అంశాలతో పాటు అన్ని అంశాలు ఇందులో వున్నాయి. కీర్తిచావ్లా అందచందాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తప్పకుండా ఈ చిత్రం అందరి మన్ననలు అందుకొని మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. క్రిష్, శివ్‌లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కుమార్, సంగీతం: సూర్య, సమర్పణ: మేడికొడూరి సాంబశివరావు.

No related posts.
Category: Cinema News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.