తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం

| September 5, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు
-ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
-ఛీ అని ఉమ్మేసినా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం లేదు
-సమ్మెకు మద్దతుగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటించాలి
-‘ట్రస్మా’ సదస్సులో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
-తెలంగాణ రైలు సిద్ధంగా ఉంది.. రైలెక్కకుంటే వెనుకబడతారు
-సమ్మె కోసం కదిలిరండి:జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు

‘‘నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం రాజీనామాలు చేయడానికి ఈ ప్రాంత ప్రజావూపతినిధులు వెనుకడుగు వేస్తుండ్రు. ఛీ అని ఉమ్మేసినా రాజీనామాలు చేయడం లేదు. సందర్భం ఏదైనా ఒకటిగా కలిసి ఉండాలి. మనం ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం టస్మా) సదస్సు ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ఒకవేళ తెలంగాణ రాకుంటే సీమాంవూధులు మనను బతకనిస్తారా? పాతాళంలోకి తొక్కేస్తరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరాల్సిందే. తెలంగాణ వచ్చి తీరాలి’’ అని అన్నారు. నిజాయితీగా, ధైర్యంగా, మడమ తిప్పని వైఖరితో తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు.

గడ్డి గాడిదకు వేసి పాలు ఆవుకు పితికినట్లుగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవుపలికారు. తెలంగాణ రావాలని గీత గీద్దామన్నారు. ఇప్పటికే అనేక రంగాలను దెబ్బ తీసిన సీమాంవూధులు చివరికి విద్యా రంగాన్ని కూడా కబళిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లకు లేని నిబంధనలు ప్రైవేట్ స్కూళ్లకెందుకని కేసీఆర్ ప్రశ్నించారు. లక్షల రూపాయల చొప్పున వివిధ పన్నులు విధిస్తున్న ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని, టోకెన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తెలంగాణలోని నిరుద్యోగులు బడి పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రైవేట్ స్కూళ్ల యజమానులను ప్రోత్సహించాల్సింది పోయి నిబంధనల పేరిట వేధింపులకు గురిచేయడం ప్రభుత్వానికి ధర్మం కాదన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను వీరు చేస్తున్నారని, విద్యా సంస్థల ద్వారా మూడు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

‘ట్రస్మా’కు సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకొని రావాలని, వారి తరఫున టీఆర్‌ఎస్ యుద్ధం చేస్తుందని భరోసా ఇచ్చారు. త్వరలో ‘ట్రస్మా’ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. విద్యారంగంలో గ్లోబల్ పోటీ పెరిగిందని, దానికి అనుగుణంగా విద్యా సంస్థలు విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

సమ్మె వేళ స్కూళ్లు బంద్ పెట్టాలి

సకల జనుల సమ్మె విజయవంతం చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించి సమ్మెలో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణవాదుల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభివూపాయపడ్డారు. టీఆర్‌ఎస్‌తో పనులు తీసుకుంటూ ఇతర పార్టీలకు ఓట్లు వేసే పరిస్థితి(ఖమ్మం జిల్లాలో ఎదురైన అనుభవాన్ని) ఆయన వివరించారు. కత్తి వేరే పార్టీకిచ్చి యుద్ధం టీఆర్‌ఎస్‌ను చేయమన్నట్లుగా ఉందని అన్నారు. కరీంనగర్‌లో 12న జరగనున్న బహిరంగ సభను సక్సెస్ చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘పీఆర్‌టీయూ-తెలంగాణ’ సకల జనుల సమ్మె పోస్టర్, ‘పాలిటెక్నిక్ గర్జన’ పోస్టర్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు.

12న సమ్మె తుడుం మోగించాలి: కోదండరాం
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలని, అందులో భాగంగా 12న కరీంనగర్‌లో సమ్మె తుడుం మోగించాలని పిలుపునిచ్చారు. 12న సభ, 13నుంచి సమ్మె అన్న రెండు పదాలు నిద్రలో కూడా మంత్రంలా జపించాలని సూచించారు. సమ్మె కోసం యావత్ తెలంగాణ సమాజం కదలాలన్నారు. తెలంగాణ రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉందని, ఈ రైలు ఎక్కకుంటే జీవిత కాలం వెనుకబడిపోతారని ఆయన హితవుపలికారు. మాయ చేసే వాళ్లు ఎక్కువయ్యారని, తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరినీ నమ్మొద్దన్నారు. తెలంగాణపై మాట ఇచ్చి, ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం సోయి తప్పి పడుకుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై పార్లమెంట్‌లో బీజేపీ, సీపీఐ ప్రశ్నిస్తే తెలుగోళ్లే పరిష్కరించుకోవాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పడం అంతా కుట్ర పూరితంగా సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై తేల్చుకోకుంటే చాతకాని వాళ్లమవుతామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల తీరును ఆయన తూర్పారబట్టారు.

‘ట్రస్మా’ జోలికి వస్తే సహించం: ఈటెల
టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వమే వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. నిజమైన సామాజిక నేపథ్యం ‘ట్రస్మా’కు మాత్రమే ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలు తెలంగాణ విద్యా సంస్థలను మింగేస్తున్నాయని, వందల కోట్ల టర్నోవర్‌తో గండి కొడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ‘ట్రస్మా’ జోలికి వస్తే సహించేది లేదని, వారికి నాలుగున్నర కోట్ల ప్రజల అండ ఉంటుందని అన్నారు. ‘ట్రస్మా’ అధ్యక్షుడు కందాల పాపిడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహాడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌డ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, ‘ట్రస్మా’ గౌరవ అధ్యక్షుడు జలజం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చింతల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Source from Namaste  Telangana

 

Related posts:

  1. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  2. సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
  3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ సమరయోధుడు మృతి
  4. ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
  5. ఓడి బానిసలవుదామా? నిలిచి గెలుద్దామా? ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ

Tags:

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


eight × 4 =



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.