కత్తి కార్తీక..

| October 20, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

కత్తి కార్తీక..

katti
కత్తి కార్తీక…ండు వైపులా పదునున్న మాటకారి. ‘వీ6’ చానల్‌లో ప్రతీ రోజు రాత్రి 9.30 ని.లకు ప్రసారమయ్యే ‘ఫన్ అండ్ మస్తీ’ కార్యక్షికమం ద్వారా తక్కువ సమయంలోనే సెలవూబిటీగా మారిన యాంకర్ ఆమె. తెలంగాణ, హైదరాబాదీ యాసలో ఆమె నిర్వహించే ఇంటర్వ్యూ అంటే ఒక్క మాటలో కెవ్వు కేక… ‘హలో…ఎవ్రూ మాట్లాడుతుండ్రు…ఎడికెల్లి మాట్లాడుతుండ్రు…’, ‘అన్న ఒక దోస్త్ కాల్ చేసిండు…’, ‘ఎమన్న చెప్పినవ చెల్లె…’, ‘ఇప్పుడొక చిన్న బ్రేక్…’, ‘ఎడకి బోకుర్రి..ఇడనే ఉండుర్రి’ అంటూ మనల్ని కట్టి పడేసే మన హైదరాబాదీ బిడ్డ ‘కార్తీక’తో ఈ వారం ‘ఫటాఫట్’.

మీ ఒరిజినల్ పేరు?
భైరగోని కార్తీక రామ్మోహన్.

మీదే వూరు?
అమ్మది సికింవూదాబాద్, నాన్నది హైద్రాబాద్.

వాళ్లు ఏం చేస్తుంటరు?
నాన్న రామ్మోహన్ రైల్వేలో ఉద్యోగం చేశారు. ఆయన ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా, అమ్మ రవిజ్యోతి ఆర్టిస్ట్, గృహిణి.

మీరేం సదివిండ్రు?
ఆర్క్‌టెక్చర్, మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్, లండన్).

టివీల కనిపించుడు ఇదే ఫస్టా?
ఔ. ఇంతకు ముందు అస్సలు టచ్ లేదు. అసలు నేను టివీ కూడా చూడ!

అంతకు ముందు ఏం చేసేవాళ్లు?
ఆర్కిటెక్ట్‌ని.

‘కత్తి కార్తీక’ ఎట్లయిండ్రు? ఎవరి ఐడియా?
క్రెడీట్ ‘వీ 6’ సీఈఓ అంకం రవి గారికే దక్కుతది. ఐయామ్ ‘హిజ్ బ్రైన్ చైల్డ్’.

మీ తొలి టీవీ ముచ్చట ఎవరితో?
సినిమా డైరెక్టర్ తేజతో. తనతో నాది ఫస్ట్ ముచ్చట అంటే నమ్మలే.

మీ ఫస్ట్ ఇంటర్వ్యూను మీరే చూసుకున్నప్పుడు ఎట్ల ఫీలయ్యిండ్రు?
అదే రోజు నైట్ వచ్చి ఇంట్ల కూర్చుని చూసిన. ‘మా అమ్మమ్మ, నానమ్మ ఉంటే గర్వంగా ఫీలయ్యేవారు కదా’ అనుకున్న.

మీ హాబీలు?
పెయింటింగ్స్ వేస్తా. వంట చేస్తా. హైదరాబాద్ బిర్యానీ మస్తు వండుత.

బుల్లితెర మీద కత్తి. మరి బయట?
కత్తి ఎక్కడైనా కత్తే.

ఈ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు మీరు పరిచయం కాకుండా ఉంటే కార్తిక ఏం చేసేది?
ఇంటీరియల్ డిజైనింగ్ స్టూడియో పెట్టేదాన్ని.

మీ లైఫ్‌లో మరిచిపోలేని ఇన్సిడెంట్? (ఈ ప్రోగ్రాం అని అనొద్దు).
లండన్ వెళ్లడం కోసం చెన్నైలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లాం. వీసా రాగానే ఆనందంతో మా నాన్న నన్ను గుండెలకు హత్తుకున్న సందర్భం.

వీకెండ్ అంతా ఖాలీయే కదా? ఏం చేస్తుంటరు?
లేటుగా లేస్త. ఆ రోజు షాపింగ్ డే. షాపింగ్ అంటే మస్త్ ఇష్టం.

హైదరాబాద్‌లో మీకు ఇష్టమైన ప్లేస్?
చార్మినార్. అక్కడి ‘చుడీ బజార్’కు వెళ్తే ఏది వదలకుండ కొంట.

మీరు వెజ్జా? నాన్ వెజ్జా?
పక్కా నాన్ అయితే, వెజ్‌లో – పచ్చి పులుసు, గోకరకాయ కాంబినేషన్ మస్త్ ఇష్టం.

మీరు సంప్రదాయ వాదా? మోడర్న్ గర్లా?
సంప్రదాయంగా ఉండడమే ఇష్టం. అప్పుడప్పుడు జీన్స్ వేస్త.

దేవుడ్ని నమ్ముతారా? (‘ఓ మై గాడ్’ అనుకునేప్పుడు కాదు).
నన్ను అసలు ఎవరూ నమ్మరు. కానీ, నేను దేవుడ్ని బాగా నమ్ముత. పెద్దమ్మ తల్లి అంటే ఇష్టం.

సరదాగా అడుగుతున్నాం..! ఎవరితో ఇంటర్వ్యూ అంటే మీరు భయపడుతరు?
పొలిటిషన్స్‌తోని ముచ్చట ఎట్ల పెడతా అని భయపడేది. కానీ, ఇప్పుడు నో భయమ్స్.

ఇప్పుడున్న యాంకర్స్‌లో మీరు ఎవరి ఫ్యాన్?
సుమలోని స్పీడ్, ఝాన్సీలో ఉన్న ఫాజిటివ్ అట్టిట్యూడ్ ఇష్టం.

మీకు ఫ్యాన్ ఫోలోయింగ్ ఎట్లున్నది?
బయట కలిసిన వాళ్లెవరైనా నన్ను వాళ్ల కుటుంబ సభ్యుల్లా, దోస్త్‌లా చూస్తరు. ఇబ్బందేం కాలేదు.

మిమ్మల్ని ఎవరన్న ఇమి చేస్తే ఎట్ల అనిపిస్తుంది?
ఫస్ట్ నవ్వొస్తది. తర్వాత మన యాసను అభిమానిస్తున్నందుకు సంబుర పడుత.

మీరు మస్త్ మస్త్‌గా ముచ్చట పెడ్తరు గదా, అండ్ల ఎవల్తో ముచ్చట బాగా ఇష్టపడ్డరు?
కవి, రచయిత జయరాజు గారితో ముచ్చట మర్చిపోలేను. అన్న పాటలు విని ఎమోషనల్ అయ్యి ఏడ్చిన.

మీరు ‘కత్తి కార్తీక’ అయ్యారు. మంచిదే. మరి ఇంట్ల? తిట్టింగ్సా? మెచ్చింగ్సా?
మెచ్చింగ్సే..నో తిట్టింగ్స్.

మీరు కత్తీ క్యారెక్టర్‌లో నటిస్తున్నారా? జీవిస్తున్నారా?
రెండూ కాదు. నన్ను నాలా చూసుకుంటున్న.

‘ఎవ్రూ?’ అని మీరడుగుతరు కదా? ఇంటికి ఎవరైనా వచ్చినా అంతేనా?
అంతేకదా మరి. (నవ్వులు)

మీకు ఫలానా వాళ్లు ‘చస్తే ఇంటర్వ్యూ ఇవ్వరు’ అనుకునే మనిషెవరు?
అట్లని ఏం లేదు. కానీ, బ్రహ్మానందం ఎవరికి దొరకరని అంటరు. ఆయనతో ముచ్చట పెట్టాలనుకుంటున్న.

మీ ప్రోగ్రామ్స్‌కు రేటింగ్ ఎట్లున్నది?
రేటింగ్ కోసం ముచ్చట పెట్టను. ముచ్చట పెడ్తే రేటింగ్ రావాలె! గట్ల…

చిన్నప్పట్నుంచీ ఇంతేనా? ‘కత్తి’ అయ్యాకే ఇట్ల మాట్లాడుతున్నరా?
(నవ్వులు) మా తాత గిట్లనే మాట్లాడేదట. ఆయన నుంచే నాకు వచ్చిందేమో!

‘కత్తి’కి తగ్గ హీరో ఎవరనుకుంటున్నారు?
మహేష్‌బాబు.

కత్తి కాంతారావు అంటే ఇష్టమేనా?
అందరూ ‘ఆయన మీ బంధువా?’ అని అడుగుతరు. అంతటి గొప్ప నటుడి పేరు ముందు ‘కత్తి’, అట్లే నా పేరు ముందు ‘కత్తి’ ఉండడం నా అదృష్టం.

కత్తికి పదును కావాలంటే మీరు చేసే కసరత్తు ఏమిటి?
నా ప్రోగ్రాంకు కనీసం స్క్రిప్ట్ కూడా ఉండదు. ఇప్పుడెట్ల ముచ్చట పెడ్తున్ననో అట్లనే పెడ్త.

మీ ఫ్యూచర్ ప్రోగ్రాం?
త్వరలో ‘క్యాంపస్‌లో కార్తీక’ ప్రారంభమవుతుంది.

లాస్టుల మా పాఠకులకు బతుకమ్మ పండుగ, దసరా శుభాకాంక్షలు చెప్పండి? (మీదైన మెసేజ్‌తో సహా…)
హాయ్! అందరు మస్త్ గున్నరు కదా? ఈ బతుకమ్మను అమ్మమ్మ, నానమ్మలతో ఖుషీగా ఆడుండ్రి, బావలు ఉంటే ఆట పట్టించుండ్రి. బతుకమ్మ పాటలు నేర్చుకుని ఎవ్రూ కూడా మన సంప్రదాయాల్ని మిస్ కాకుండ్రి. సీ యూ…బైబై…

- మధుకర్ వైద్యుల

 

Tags: , కత్తి కార్తీక..

Category: City News, News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


− 1 = seven





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.